Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రకుల్ కోరిక తీరుతోంది... పవన్ నెక్స్ట్ మూవీలో ఛాన్స్!

రకుల్ ప్రీత్ సింగ్ అందగత్తెనే కాదు .. అంతకి మించిన అదృష్టవంతురాలు కూడా. అందువల్లనే ఆమెకి వరుసగా మెగా ఫ్యామిలీ హీరోలతో నటించే ఛాన్స్ దొరుకుతోంది. 'బ్రూస్ లీ' సినిమాలో చరణ్ తో పాటు చిరంజీవితోను ఓ సీన్లో కనిపించి మెగాస్టార్ తోను చేశాననే ముచ్చట తీర్చుకుంది. ఆ తరువాత  అల్లు అర్జున్ తోను .. సాయిధరమ్ తేజ్ తోను సందడి చేసింది. త్వరలో వరుణ్ తేజ్ తో చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తో కలిసి నటించాలని ఉందంటూ ప్రతి ఇంటర్వ్యూలోను రకుల్ చెబుతూ వస్తోంది. త్వరలోనే ఆమె కోరిక నెరవేరే ఛాన్స్ ఉందనే టాక్ తాజాగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు తరువాత ఆయన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఆ సినిమాలో కథానాయికగా రకుల్ ను తీసుకోవాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట. పారితోషికం కాస్త తక్కువైనా ఆమె మాత్రం ఈ ఛాన్స్ వదులుకోకపోవచ్చని చెప్పుకుంటున్నారు.      
pavan
rakul

More Telugu News